అందుకే వివాహం చేసుకోలేదు: మాయావతి

Vijay K

Vijay K |

Updated on: Apr 03, 2019 | 9:28 AM

ప్రజల అభ్యున్నతికే తన జీవితాన్ని త్యాగం చేశానని, అందుకే వివాహం చేసుకోలేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి చెప్పారు. యూపీలో ఏర్పాటైన మాయావతి విగ్రహాలపై ఓ న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనంతో ఆ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని న్యాయవాది ఆరోపించారు. అయితే దీనిపై మాయావతి స్పందిస్తూ పేదల కోసం వైవాహిక జీవితాన్ని పక్కన పెట్టిన ఓ దళితమహిళ గౌరవార్థం ప్రజలే స్వయంగా విగ్రహాలను ఏర్పాటు చేయమని కోరారని, అందుకే […]

అందుకే వివాహం చేసుకోలేదు: మాయావతి

ప్రజల అభ్యున్నతికే తన జీవితాన్ని త్యాగం చేశానని, అందుకే వివాహం చేసుకోలేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి చెప్పారు. యూపీలో ఏర్పాటైన మాయావతి విగ్రహాలపై ఓ న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనంతో ఆ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని న్యాయవాది ఆరోపించారు.

అయితే దీనిపై మాయావతి స్పందిస్తూ పేదల కోసం వైవాహిక జీవితాన్ని పక్కన పెట్టిన ఓ దళితమహిళ గౌరవార్థం ప్రజలే స్వయంగా విగ్రహాలను ఏర్పాటు చేయమని కోరారని, అందుకే విగ్రహాలు పెట్టించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విగ్రహాలు రాష్ట్ర ప్రభుత్వానికి పర్యాటకంగా ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయని కూడా ఆమె చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా పాలన చేస్తున్న నాయకుల నుంచి ప్రజలకు విముక్తిని కలిగించాలని తాను చాలా సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నానని మాయావతి చెప్పారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu