నేడు హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌ల మూసివేత
ముస్లిం సోదరుల పర్వదినం షబ్-ఎ-మేరాజ్ సందర్భంగా వారు రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా నగరంలోని ఫ్లైఓవర్‌లను మూసివేయాలని సీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం వరకు అన్ని ఫ్లైఓవర్‌లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే గ్రీన్‌ల్యాండ్, లంగర్‌హౌజ్ ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వేలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని సీపీ తెలిపారు.