ఆదిలాబాద్‌ తాడిగూడలో హైటెన్షన్.. బయటకొచ్చేందుకు జంకుతున్న ప్రజలు.. పోలీసుల భారీ బందోబస్త్..

|

Dec 19, 2020 | 12:56 PM

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాడిగూడలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు స్థానిక ప్రజలు భయపడుతున్నారు.

ఆదిలాబాద్‌ తాడిగూడలో హైటెన్షన్.. బయటకొచ్చేందుకు జంకుతున్న ప్రజలు.. పోలీసుల భారీ బందోబస్త్..
Follow us on

High Tension in Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాడిగూడలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు స్థానిక ప్రజలు భయపడుతున్నారు. పథకం ప్రకారమే ఫారుఖ్‌ దాడికి తెగబడ్డాడని బాధిత సయ్యద్ జమీర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలవాలనే రాజకీయ దురుద్దేశంతోనే తమ అన్నయ్యపై దాడి చేశాడని సయ్యద్ జమీర్ తమ్ముడు ఆరోపించారు. గత మునిసిపాలిటీ ఎన్నికల్లోనూ తమను భయబ్రాంతులకు గురిచేశాడని, ఎన్నిల్లో పోటీ చేయవద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని వాపోయాడు. అక్కడి ప్రజలు సైతం ఫారుఖ్ చర్యకు హడిపోతున్నారు. గతంలోనూ ఇలాగే స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడని చెబుతున్నారు. కాగా, తాడిగూడలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోస్త్ ఏర్పాటు చేశారు. ఎవరైనా తేడాగా కనిపిస్తే చాలు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఎవరూ కూడా ఒక్కచోట గుమికూడొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు, మునిసిపల్ మాజీ వైఎస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ పాత కక్షలను మనసులో పెట్టుకుని ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం నాడు సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన ఆదిలాబాద్‌లోని తాడిగూడలో తీవ్ర ప్రపకంపనలు సృష్టించింది. మరోవైపు.. ఫారూక్ అహ్మద్ కావాలనే ఈ దాడులు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ఆయుధాల చట్టం 307, 327 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

Also read:

ఆదిలాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. ముగ్గురికి గాయాలు

దేశంలో కోటి మార్క్ దాటిన కరోనా పాజిటివ్ కేసులు.. 95 శాతాన్ని దాటిన రికవరీ రేటు.. పూర్తి వివరాలివే.!!