ఆదిలాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. ముగ్గురికి గాయాలు

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని తాటిగూడలో తుపాకీ కాల్పులు కలకలం‌ సృష్టించాయి. ఎంఐఎం పార్టీ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ రివాల్వర్‌తో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు.

ఆదిలాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. ముగ్గురికి గాయాలు
Follow us

|

Updated on: Dec 18, 2020 | 8:24 PM

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని తాటిగూడలో తుపాకీ కాల్పులు కలకలం‌ సృష్టించాయి. ఎంఐఎం పార్టీ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ రివాల్వర్‌తో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా పడ్డారు. ఫారూఖ్‌ ఐదు రౌండ్లు కాల్పులు జరపగా ఒకరికి తల, మరొకరికి పొట్ట భాగంలో బులెట్లు దూసుకెళ్లాయి. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

పాత కక్షల నేపథ్యంలో ఫారూఖ్ కాల్పులకు తెగబడ్డట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తుపాకీతో ఫారూఖ్‌ వీర విహారం చేసినట్లు స్థానికులు తెలిపారు. కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

చిన్న పిల్లలు క్రికెట్ అడుతుండగా గొడవ జరిగింది.. ఈ గొడవలో పెద్దలు తలదూర్చడంతో ఘర్షణకు దారితీసిందని ఆదిలాబాద్ ఓఎస్డీ రాజేష్ చంద్ర తెలిపారు. దీంతో ఆవేశానికి లోనైన మాజీ మున్సిపల్ వైస్ పారూఖ్ తలదూర్చి కాల్పులు జరిపారని ఆయన వెల్లడించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారని.. గాయపడిన వారిలో జమీర్ కు మూడు తుటాలు దిగాయని ఆయన తెలిపారు. మోసిన్ అనే వ్యక్తి చాతిలో తూటా దిగిందన్నారు. మరో వ్యక్తి మన్నన్ కు తలపై నుండి దూసుకవెళ్లింది. గాయపడ్డవారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఓఎస్డీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఫారూఖ్ పై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామన్నారు.