రణరంగంగా మారిన హైదరాబాద్ ఉప్పుగూడ.. కాళికామాత ఆలయానికి సంబంధించిన 70 కోట్ల విలువైన స్థల వివాదంలో ఘర్షణ

|

Dec 16, 2020 | 3:49 PM

హైదరాబాద్ ఉప్పుగూడ రణరంగంగా మారింది. కాళికామాత ఆలయానికి సంబంధించిన 70 కోట్ల విలువైన స్థల వివాదం ఘర్షణకు దారితీసింది. 24, 25, 26 సర్వే నెం..

రణరంగంగా మారిన హైదరాబాద్ ఉప్పుగూడ.. కాళికామాత ఆలయానికి సంబంధించిన 70 కోట్ల విలువైన స్థల వివాదంలో ఘర్షణ
Follow us on

హైదరాబాద్ ఉప్పుగూడ రణరంగంగా మారింది. కాళికామాత ఆలయానికి సంబంధించిన 70 కోట్ల విలువైన స్థల వివాదం ఘర్షణకు దారితీసింది. 24, 25, 26 సర్వే నెంబర్లలో దేవాదాయశాఖకు చెందిన 7 ఎకరాల 13 గుంటల స్థలం అన్యాక్రాంతం కావడం అలజడికి కారణమైంది. ఆ స్థలం తనదంటూ ఓ వ్యక్తి సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ అర్దర్‌ తెచ్చుకుని..నిర్మాణాలు చేపట్టడంతో… స్థానికులు, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో స్థానికులను, బీజేపీ నేతలను పోలీసులు ఈడ్చుకు వెళ్లి వాహనాల్లో పడేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇలాఉండగా, వివాదానికి కారణమైన స్థలాన్ని 1951లోనే దేవాదాయశాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటిదాకా 11 సార్లు వేలం వేస్తున్నట్లు ప్రకటనలు చేసి..ఓసారి వేలం పాట కూడా నిర్వహించింది. అయితే తక్కువ ధరకు వేలం వేశారని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ వేలంపాటను రద్దు చేశారు. ఆలయ ట్రస్ట్‌ ఆ స్థలాన్ని తనకు అమ్మిందంటూ… ఇప్పుడు ఓ వ్యక్తి స్థల స్వాధీనానికి ప్రయత్నించటంతో బీజేపీ నేతలు, స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులతో వాదనకు దిగారు. అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులో తీసుకునే క్రమంలో తోపులాట జరిగింది.