జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు ఉగ్రరూపం

|

Oct 21, 2020 | 12:08 PM

హైదరాబాద్ జీడిమెట్ల దగ్గరున్న ఫాక్స్ సాగర్ చెరువు ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. 37 అడుగుల సామర్ధం ఉన్న చెరువులో ప్రస్తుత నీటి మట్టం 34 అడుగులకు చేరింది. చెరువుకు ఎప్పుడు గండి పడుతుందోనని పోలీసులు చెరువు దగ్గర కాపలా ఉన్నారు. మళ్ళీ భారీ వర్షం పడితే చెరువు పూర్తిగా నిండిపోయి కట్టలు తెగే ప్రమాదం ఉండటంతో జీడిమెట్ల ఫాక్స్ సాగర్ ప్రాంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఫాక్స్ చెరువు ఉగ్రరూపంతో ఉమమహేశ్వర కాలనీ పూర్తిగా నీట మునగగా, జలదిగ్భందంలో […]

జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు ఉగ్రరూపం
Follow us on

హైదరాబాద్ జీడిమెట్ల దగ్గరున్న ఫాక్స్ సాగర్ చెరువు ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. 37 అడుగుల సామర్ధం ఉన్న చెరువులో ప్రస్తుత నీటి మట్టం 34 అడుగులకు చేరింది. చెరువుకు ఎప్పుడు గండి పడుతుందోనని పోలీసులు చెరువు దగ్గర కాపలా ఉన్నారు. మళ్ళీ భారీ వర్షం పడితే చెరువు పూర్తిగా నిండిపోయి కట్టలు తెగే ప్రమాదం ఉండటంతో జీడిమెట్ల ఫాక్స్ సాగర్ ప్రాంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఫాక్స్ చెరువు ఉగ్రరూపంతో ఉమమహేశ్వర కాలనీ పూర్తిగా నీట మునగగా, జలదిగ్భందంలో 650 ఇళ్లు చిక్కుకుపోయాయి. జీహెచ్ఎంసీ అధికారులు సహయక చర్యల్లో నిమగ్నమైనప్పటికీ ప్రజల కష్టాలు కొలిక్కి రావడంలేదు.