రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ట్రక్కు-తుఫాన్ వాహనం ఢీ.. పది మంది మ‌ృతి, పలువురికి తీవ్రగాయాలు

రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. చిత్తోర్‌గఢ్‌ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు.

రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ట్రక్కు-తుఫాన్ వాహనం ఢీ.. పది మంది మ‌ృతి, పలువురికి తీవ్రగాయాలు

Updated on: Dec 13, 2020 | 6:00 AM

రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. చిత్తోర్‌గఢ్‌ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉదయపూర్-నింబహేరా రహదారిపై సాదుల్కేర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న తుఫాన్‌ వాహనాన్ని ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టడంతో 10 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో తుఫాన్‌ వాహనం నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదం సంభవించింది.

ఈ సంఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.”చిత్తోర్‌గఢ్‌లోని నికుంబ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్నందుకు చాలా బాధగా ఉంది, ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం. గాయపడినవారిని త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు” అంటూ గెహ్లాట్ ట్వీట్ చేశారు.