తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్‌లు.. త్వరలోనే మార్పు

| Edited By:

Jul 02, 2019 | 11:38 AM

ఇరు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి హోంశాఖ వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల తరువాత రెండు రాష్ట్రాలకు గవర్నన్ల నియమాకం జరిగే అవకాశం ఉంది. కాగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అందుకోసమే విజయవాడలో ఇదివరకు ముఖ్యమంత్రి ఆఫీసుగా ఉన్న కార్యాలయాన్ని గవర్నర్ కార్యాలయంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నట్లు సమాచారం. కాగా విభజన చట్టం ప్రకారం పదేళ్లు […]

తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్‌లు.. త్వరలోనే మార్పు
Follow us on

ఇరు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి హోంశాఖ వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల తరువాత రెండు రాష్ట్రాలకు గవర్నన్ల నియమాకం జరిగే అవకాశం ఉంది. కాగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అందుకోసమే విజయవాడలో ఇదివరకు ముఖ్యమంత్రి ఆఫీసుగా ఉన్న కార్యాలయాన్ని గవర్నర్ కార్యాలయంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నట్లు సమాచారం.

కాగా విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఇన్నాళ్లు ఒకే గవర్నర్‌ను కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు వాటి వాటి భూభాగాల నుంచి పరిపాలన చేస్తుండటం, హైకోర్టు కూడా వేరుపడిన నేపథ్యంలో వేర్వేరు గవర్నర్లను నియమిస్తే బావుంటుందని కేంద్ర అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలు విభజన కాకముందు నుంచే(2009) నరసింహన్ గవర్నర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.