‘సినీ పరిశ్రమలో తెలుగుకి అధోగతి.. సిగ్గుపడుతున్నా’..!

| Edited By: Srinu

Dec 02, 2019 | 4:37 PM

టాలీవుడ్‌లో తెలుగు భాష అధోగతి పాలవుతోందని.. జనసేన అధ్యక్షుడు పనవ్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తెలుగు వైభవం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. నా మాతృభాష కాని ఇంగ్లీషు వల్ల.. ఇంటర్మీడియట్‌తో చదువు ఆపేసినట్టు వెల్లడించారు. ప్రభుత్వాలు.. మాతృభాషను పరిరక్షిస్తాయని అనుకోవడం లేదు. కాగా.. అటు తెలుగు సినిమా హీరోలలో కూడా చాలా మందికి తెలుగు చదవడం, రాయడం కూడా రాదన్నారు. సినిమాల్లోని బూతుల వల్ల సమాజంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. […]

సినీ పరిశ్రమలో తెలుగుకి అధోగతి.. సిగ్గుపడుతున్నా..!
Follow us on

టాలీవుడ్‌లో తెలుగు భాష అధోగతి పాలవుతోందని.. జనసేన అధ్యక్షుడు పనవ్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తెలుగు వైభవం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. నా మాతృభాష కాని ఇంగ్లీషు వల్ల.. ఇంటర్మీడియట్‌తో చదువు ఆపేసినట్టు వెల్లడించారు. ప్రభుత్వాలు.. మాతృభాషను పరిరక్షిస్తాయని అనుకోవడం లేదు. కాగా.. అటు తెలుగు సినిమా హీరోలలో కూడా చాలా మందికి తెలుగు చదవడం, రాయడం కూడా రాదన్నారు. సినిమాల్లోని బూతుల వల్ల సమాజంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమలో తెలుగు పూర్తిగా దిగజారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు ప్రేక్షకులు ద్వారా డబ్బు అవసరం కానీ.. తెలుగు నేర్చుకోవాలని.. మాత్రం సినిమాల్లోని చాలా మందికి లేదని పేర్కొన్నారు. తెలుగు భాష మూలాలను చంపాలని చూస్తున్నారని.. దయచేసి అలా చేయొద్దని ఆయన కోరారు. మాతృభాషలో మాట్లాడేందుకు పదాలు వెతుక్కునే తపన పడాల్సి వస్తోంది. ఈ విషయంపై సిగ్గుపడుతున్నా.. బాధపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. మాతృభాషపై పట్టు ఉంటే ఇతర భాషలు నేర్చుకోవడం సులువవుతుందని.. ఓట్ల కోసం మన సంస్కృతి, భాషను కాపాడుకునేందుకే నా ఈ ప్రయత్నమన్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేవని.. హాస్టళ్లలో సరైన భద్రతలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.