ఉదయాన్నే కప్పు టీ పడందే కాలు కదపని గుర్రం..!

ఉదయాన్నే కప్పు టీ పడందే కాలు కదపని గుర్రం..!

చాలా మందికి ఉదయాన్నే వేడివేడిగా కాఫీ లేదా టీ గానీ తాగందే..ఏ పనీ జరగదు. టీ తాగకపోతే, కొందరికి ఆ రోజంతా వెలితిగా ఉంటుందంటారు. ఇక చలికాలంలో అయితే, వేరే చెప్పక్కర్లేదు..మరి కొందరికి ఉదయం, సాయంత్రం రెండు పూటలా కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, మనుషుల మాదిరిగానే ఓ గుర్రం కూడా ఉదయం లేవగానే కప్పు టీ తాగందే కాలు కదపదట..ఇది వింటే ఆశ్చర్యంగా ఉందికదా..! కానీ, ఇది నిజమేనట. ఇప్పుడు ఆ అశ్వానికి […]

Anil kumar poka

|

Dec 02, 2019 | 1:57 PM

చాలా మందికి ఉదయాన్నే వేడివేడిగా కాఫీ లేదా టీ గానీ తాగందే..ఏ పనీ జరగదు. టీ తాగకపోతే, కొందరికి ఆ రోజంతా వెలితిగా ఉంటుందంటారు. ఇక చలికాలంలో అయితే, వేరే చెప్పక్కర్లేదు..మరి కొందరికి ఉదయం, సాయంత్రం రెండు పూటలా కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, మనుషుల మాదిరిగానే ఓ గుర్రం కూడా ఉదయం లేవగానే కప్పు టీ తాగందే కాలు కదపదట..ఇది వింటే ఆశ్చర్యంగా ఉందికదా..! కానీ, ఇది నిజమేనట. ఇప్పుడు ఆ అశ్వానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లండన్‌లోని మెర్సీసైడ్‌ పోలీసుల వద్ద 15 ఏళ్లుగా ఉంటోంది జాక్‌ అనే గుర్రం. పోలీసులు చేసే ఆపరేషన్లలో జాక్‌ చాలా చురుగ్గా పాల్గొంటుందట. మైదట్లో జాక్‌ ట్రైనర్‌ లిండ్సే గేవన్‌ పొద్దునే దాన్ని నిద్రలేపటానికి టీ ఇచ్చేవాడట. దీంతో దానికి అది అలవాటుగా మారిపోయిందట. అప్పట్నుంచి అది..ప్రతి రోజూ ఉదయం ముందుగా టీ తాగందే..ఏ పని చేయదట. దీంతో మెర్సీసైడ్‌ పోలీసులు దానికోసం పెద్దసైజు మగ్గును తయారు చేయించారు. పొద్దుటే రెండు షుగర్‌ క్రిస్టల్స్‌ బాల్స్ ను వేసి టీ తాగిస్తారట. అంతేకాదు, రాత్రి పూట కూడా టీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని లేదంటే అది నిద్రపోదని చెప్పారు అక్కడి పోలీసు ఉన్నతాధికారులు. ఈ మేరకు జాక్‌ టీ తాగుతున్న వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దీంతో రెండు పూటలా టీ అలవాటున్న జాక్‌పై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu