AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో సినిమా షూటింగ్ షూరు.!

సినీ రంగంలో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు, రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు సమావేశం.

ఏపీలో సినిమా షూటింగ్ షూరు.!
Balaraju Goud
|

Updated on: Jun 09, 2020 | 5:23 PM

Share

సినీ రంగంలోని సమస్యల పరిష్కారంతో పాటు, రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్‌బాబు, సి.కల్యాణ్‌, దిల్‌రాజు తదిరులు సీఎంను కలిసారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై ఈ సందర్భంగా సీఎంతో చర్చించారు. రాష్ట్రంలో ఉచితంగా సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరో వైపు విశాఖలో సినీ పరిశ్రమ విస్తరణకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా, సీరియల్స్ షూటింగ్స్ ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. తొలుత మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో 25మంది సినీ ప్రముఖుల బృందం సీఎం జగన్‌ను కలవాలని అనుకున్నారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏడుగురికి మాత్రమే కలిసే అవకాశం లభించింది.ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన సినీ ప్రముఖులకు ముఖ్యమంత్రి జగన్‌ సాదరస్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశం అయ్యారు. కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని సీఎంకి వివరించారు. దాదాపు మూడు నెలల పాటు సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. సినిమా రంగం పూర్వ వైభవం సాధించాలంటే తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వినోదపన్నుకు మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. విశాఖలో స్టూడియోలు, ల్యాబ్‌లు నిర్మాణానికి సినీ రంగం సిద్ధంగా ఉందని ఇందుకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిగా సీఎం జగన్ కోరారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఏడాది కాలంగా కలవాలని అనుకున్నాం కుదరలేదని.. ఈ రోజు సినీ పరిశ్రమ తరుపున కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపామన్నారు . కరోనాతో నిలిచిపోయిన షూటింగ్ లకు అనుమతిచ్చినందుకు జగన్ కి ప్రత్యేక దన్యవాదాలు తెలిపామన్నారు. అలాగే థియేటర్లలో మినిమం ఫిక్స్డ్ ఛార్జ్ లు ఎత్తివేయాలని కోరామన్నారు. మరోవైపు పెండింగ్ లో ఉన్న నంది వేడుకలను నిర్వహించాలని కోరామన్న చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం సంతోషాన్నిచ్చిందన్నారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!