టీవీ నటుడు సుశీల్‌ ఆత్మహత్య.. శోక సంద్రంలో చిత్ర పరిశ్రమ..!

ఉజ్వల భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ వంటి నటుల మరణాలు బాలీవుడ్‌ను శోక సంద్రంలో ముంచెత్తాయి. ఈ క్రమంలో

టీవీ నటుడు సుశీల్‌ ఆత్మహత్య.. శోక సంద్రంలో చిత్ర పరిశ్రమ..!

Edited By:

Updated on: Jul 08, 2020 | 10:08 PM

ఉజ్వల భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ వంటి నటుల మరణాలు బాలీవుడ్‌ను శోక సంద్రంలో ముంచెత్తాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని మండ్యలో ప్రముఖ టీవీ నటుడు సుశీల్‌ గౌడ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 30 ఏళ్ల వయసున్న సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడటం అతని స్నేహితుల్లో, శాండల్‌వుడ్‌లో, టీవీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.

కేవలం నటుడిగానే కాకుండా ఆయన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా చాలా మంది సెలబ్రిటీలకు హెల్త్ టిప్స్ అందించే వారు.. అలాగే కన్నడ చిత్రాల్లో నటించేందుకు సుశీల్‌ ప్రయత్నాలు చేస్తుండేవారు. హీరో  దునియా విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రంలో సుశీల్‌ పోలీసు పాత్రలో నటించారు. అయితే ఆ చిత్రం విడుదలకు ముందే ఆత్మహత్యకు పాల్పడి అందరినీ షాక్‌కు గురిచేశారు.

ఈ సంఘటనపై దునియా విజయ్‌ ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు. ‘నేను సుశీల్‌ను మొదటిసారి చూసినప్పుడు అతను హీరో కావాల్సిన వ్యక్తి అనుకున్నాను. కానీ మూవీ విడుదలకు ముందే అతను మనల్ని విడిచి వెళ్లిపోయాడు. సమస్య ఏదైనా ఆత్మహత్య దానికి పరిష్కారం కాదు. ఈ ఏడాది వరుస మరణాలు కనుమరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదని అనిపిస్తోంది.’ అని తెలిపారు.