హైదరాబాద్ లో సిటీ బస్సులు.. కానీ వారికోసం మాత్రమే..!

|

May 22, 2020 | 9:08 PM

కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ లోకి వెళ్లిన సంస్థలు ఒక్కొక్కటిగా కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సర్కార్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా కొనసాగాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు వీలుగా శనివారం నుంచి హైదరాబాద్‌లో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. నగరంలోని వివిధ చోట్ల నుంచి కార్యాలయాలకు వచ్చేవారికి బస్సు సౌకర్యం కల్పించామన్నారు. మొత్తం 32 మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు బస్సు సౌకర్యం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. […]

హైదరాబాద్ లో సిటీ బస్సులు.. కానీ వారికోసం మాత్రమే..!
Follow us on

కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ లోకి వెళ్లిన సంస్థలు ఒక్కొక్కటిగా కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సర్కార్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా కొనసాగాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు వీలుగా శనివారం నుంచి హైదరాబాద్‌లో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. నగరంలోని వివిధ చోట్ల నుంచి కార్యాలయాలకు వచ్చేవారికి బస్సు సౌకర్యం కల్పించామన్నారు. మొత్తం 32 మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు బస్సు సౌకర్యం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యోగులు గుర్తింపు కార్డులు చూపి బస్సులోకి ఎక్కాల్సిందిగా సూచించారు. ఈ మేరకు ప్రత్యేక బస్సుల సౌకర్యంపై టీఎన్జీవో ఉద్యోగుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది. ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి.