తెలంగాణ: బార్‌లోకి దూసుకెళ్లిన బస్సు..

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 25వ రోజుకు చేరింది. ప్రజలు ఆర్టీసీ సమ్మె వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటోన్న విషయం తెలిసిందే.   తాత్కాలిక డ్రైవర్లు బస్సులు నడుపుతుండడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఖమ్మం జిల్లా బోనకల్ క్రాస్ రోడ్డులో ఓ బార్‌లోకి ఆర్టీసీ బస్సు దూసుకుని వెళ్లింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. తాత్కాలిక డ్రైవర్లకు సరైన […]

తెలంగాణ: బార్‌లోకి దూసుకెళ్లిన బస్సు..

Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2019 | 6:03 PM

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 25వ రోజుకు చేరింది. ప్రజలు ఆర్టీసీ సమ్మె వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటోన్న విషయం తెలిసిందే.   తాత్కాలిక డ్రైవర్లు బస్సులు నడుపుతుండడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఖమ్మం జిల్లా బోనకల్ క్రాస్ రోడ్డులో ఓ బార్‌లోకి ఆర్టీసీ బస్సు దూసుకుని వెళ్లింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

తాత్కాలిక డ్రైవర్లకు సరైన అనుభవం లేకపోవడం,  విధుల్లో అలసత్వం చూపిస్తుండటంతో ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి . కొంతమంది తాత్కాలిక డ్రైవర్లు ఏకంగా  మద్యం సేవించి మరీ బస్సులను నడుపుతున్నారు. ఇంకొందరు హై స్పీడ్‌‌తో డ్రైవ్ చేస్తున్నారు. దీంతో  బస్సు ప్రయాణికులు భయంతో.. ఆర్టీసీ తిప్పుతున్న బస్సులు  ఎక్కాలంటేనే  జంకుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, యూనియన్లు బెట్టు వీడి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పలువురు నిపుణులు కోరుతున్నారు.