వాహనదారులు జాగ్రత్త.. నెంబర్ ప్లేట్లు సరిగా లేని వారిపై చర్యలకు సిద్ధమవుతోన్న తెలంగాణ పోలీసులు.
మీ వాహనల నెంబర్ ప్లేట్లు సరిగా కనిపిచడం లేదా.? నెంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అంటించడం, నెంబర్ కనిపించడకుండా బెండ్ చేశారా.? అయితే జాగ్రత్తగా ఉండండి..
Ts police special drive: మీ వాహనల నెంబర్ ప్లేట్లు సరిగా కనిపిచడం లేదా.? నెంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అంటించడం, నెంబర్ కనిపించడకుండా బెండ్ చేశారా.? అయితే జాగ్రత్తగా ఉండండి.. పోలీసుల దృష్టిలో పడ్డారంటే ఇక మీ పని అంతే. మోటారు వాహన చట్టం ప్రకారం నంబరు ప్లేట్లు సరిగా లేని వాహనాల్ని గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. నెంబరు ప్లేటు లేని, నెంబర్ కనిపించడకుండా ఉన్న వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలను గుర్తించే కార్యక్రమాన్ని మొదటగా పోలీసుల సిబ్బంది, పోలీసు కార్యలయాలకు వచ్చే వాహనాల నుంచే మొదలుపెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు.