ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల శాసన మండలి సంతాపం

|

Sep 07, 2020 | 1:49 PM

శాస‌న‌మండలి రేప‌టికి వాయిదా ప‌డింది. వర్షకాల స‌మావేశాల్లో భాగంగా సోమవారం శాసనమండ‌లి స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల శాసనమండ‌లి సంతాపం తెలిపింది.

ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల శాసన మండలి సంతాపం
Follow us on

శాస‌న‌మండలి రేప‌టికి వాయిదా ప‌డింది. వర్షకాల స‌మావేశాల్లో భాగంగా సోమవారం శాసనమండ‌లి స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల శాసనమండ‌లి సంతాపం తెలిపింది. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతిపై సంతాప తీర్మానాన్ని హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. దేశం గొప్ప‌నేత‌ను కోల్పోయింద‌ని విచారం వ్య‌క్తంచేశారు. ప్ర‌ణ‌బ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని ప్రేమ‌గా దాదా అని పిలుచుకునేవార‌ని చెప్పారు. సంతాప తీర్మానంపై పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రసంగించారు. ప్రణబ్ దేశానికి చేసిన సేవల గురించి కొనియాడారు.

ప్ర‌ణబ్ ముఖ‌ర్జీ ఉద్యోగి స్థాయి నుంచి భారత ప్రథమ పౌరుడు రాష్ట్ర‌ప‌తిగా ఎదిగార‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్ర‌తి పద‌వికి వ‌న్నెతెచ్చార‌ని గుర్తుచేశారు. చిన్న వ‌య‌సులో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నేత అని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాజ‌కియాల్లో అనేక ఎత్తుప‌ల్లాలు చూశార‌ని వెల్ల‌డించారు. మండ‌లి స‌భ్యులు ప్ర‌ణ‌బ్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆయ‌న‌ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధించారు. అనంతరం శాసనమండలి సమావేశాన్ని రేపటి వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.