నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

తెలంగాణ శాసన సభ నేటినుంచి రెండు రోజులపాటు సమావేశం కానుంది. ప్రధానంగా మున్సిపల్ చట్టాల బిల్లును ఆమెదించేందుకు ఇవాళ, రేపు సభ జరగనుంది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మున్సిపల్ చట్టాల బిల్లును సభలో ప్రవేశపెట్టి అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేయనున్నారు. శుక్రవారం ఈ బిల్లుపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే అదేరోజు మధ్యాహ్నం  2 గంటలకు శాసన మండలి సమావేశమై ఇదే బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు. […]

నేటి నుంచి  తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

Edited By:

Updated on: Jul 18, 2019 | 6:53 AM

తెలంగాణ శాసన సభ నేటినుంచి రెండు రోజులపాటు సమావేశం కానుంది. ప్రధానంగా మున్సిపల్ చట్టాల బిల్లును ఆమెదించేందుకు ఇవాళ, రేపు సభ జరగనుంది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మున్సిపల్ చట్టాల బిల్లును సభలో ప్రవేశపెట్టి అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేయనున్నారు. శుక్రవారం ఈ బిల్లుపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే అదేరోజు మధ్యాహ్నం  2 గంటలకు శాసన మండలి సమావేశమై ఇదే బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రత్యేకించి మున్సిపల్ చట్టాల బిల్లులతో పాటు మరో నాలుగు ఆర్డినెన్స్‌ల బిల్లులు కూడా ఆమెదించనున్నారు.

రెండు రోజులపాటు అత్యవసరంగా సమావేశమవుతున్నందున సాధారణంగా సభలో జరిగే పద్థతుల్లో కాకుండా కేవలం ఎజెండాలోని అంశాలపైనే చర్చించి బిల్లులను ఆమోదించనున్నారు.