TS Inter Memos: ఆన్‌లైన్‌లో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ మార్కుల మెమో.. ఏవైనా తప్పులుంటే అప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలి.

|

Jul 01, 2021 | 7:29 PM

TS Inter Memos: కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసిన విధంగానే తెలంగాణలోనూ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలను నిర్వహించాలని భావించిన ప్రభుత్వం కుదరకపోయే సరికి చివరికి..

TS Inter Memos: ఆన్‌లైన్‌లో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ మార్కుల మెమో.. ఏవైనా తప్పులుంటే అప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలి.
Ts Inter Memos
Follow us on

TS Inter Memos: కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసిన విధంగానే తెలంగాణలోనూ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలను నిర్వహించాలని భావించిన ప్రభుత్వం కుదరకపోయే సరికి చివరికి వాటిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో సాధించిన మార్కులతో ఆధారంగానే సెకండ్‌ ఇయర్‌లోనూ విద్యార్థులను ఉత్తీర్ణులను చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మొదటి ఏడాదిలో ఫెయిల్‌ అయిన వారికి 35 శాతం కనీస మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించారు.
ఇదిలా ఉంటే ఈ పక్రియను పూర్తి చేసిన ఇంటర్ బోర్డ్‌ తాజాగా మార్కుల మెమోను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు మెమో మార్క్స్‌ కలర్‌ ప్రింట్‌ అవుట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ కల్పించింది. ఇందుకోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.inలోకి వెళ్లి తమ వివరాలను ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 01-07-2021 మధ్యాహ్నం 2 గంటల నుంచి సెకండ్ ఇయర్ జనరల్ మెమో, సెకండ్ ఇయర్ వొకేషనల్ మెమో, సెకండ్ ఇయర్ జనరల్ బ్రిడ్జ్ కోర్సు మెమో, సెకండ్ ఇయర్ ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు మెమోను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది విద్యార్థులకు ఆన్‌లైన్ మెమో (షార్ట్ మెమో)ను మాత్రమే జారీ చేయనున్నారు. విద్యార్థులు పై తరగతుల అడ్మిషన్‌కోసం ఈ షార్ట్‌ మెమో ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక మార్కుల మెమోలో ఏవైనా పొరపాట్లు దొర్లితే.. సంబంధిత ప్రిన్సిపాల్స్ లేదా హెల్ప్‌డెస్క్‌కు మెయిల్ ద్వారా బోర్డుకు తెలపాలని సూచించారు. పొరపాట్లను సరిదిద్దుకునేందుకుగాను దరఖాస్తులను10-07-2021 వరకు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు తెలిపారు.

Also Read: Revanth Reddy: వైఎస్సార్, ఎన్టీఆర్‌ను తిట్టినవారంతా నికృష్టులే.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..

TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తుల గడువు పెంచుతూ నిర్ణయం..

వావ్ ! ‘స్వీటే ఆయుధం కాగా’… బర్త్ డే కేక్ విసిరి చిరుత దాడి నుంచి తప్పించుకున్నారు.. ఎక్కడంటే..?