
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని హై కోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి బాలాయంలో డిసెంబర్ 20 ఉదయాన నిర్వహించిన సుదర్శన నరసింహా హోమం, స్వామి వారి పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి, శివాలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా కృష్ణ శిలలతో ఆలయాన్ని నిర్మించడం అద్భుతంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిలో తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.