తెలంగాణలో.. నల్లా బిల్లులు కట్టనివారికి గోల్డెన్ ఛాన్స్..!

| Edited By:

Aug 11, 2020 | 6:21 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నల్లా బిల్లులు ఇంకా కట్టని వారికి ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించింది.

తెలంగాణలో.. నల్లా బిల్లులు కట్టనివారికి గోల్డెన్ ఛాన్స్..!
Follow us on

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నల్లా బిల్లులు ఇంకా కట్టని వారికి ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించింది. ఈ విషయాన్ని మంగళవారం మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేవలం అసలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని కేటీఆర్‌ తెలిపారు.

ఈ రోజు ప్రగతిభవన్‌లో జలమండలి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పథకం కరపత్రాలు, పోస్టర్లను కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు 45 రోజుల పాటు ఈ ఆఫర్ అమలులో ఉంటుందని మంత్రి తెలిపారు. జలమండలికి బిల్లులు క్రమంగా చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఓటీఎస్ (వన్ టైం సెటిల్‌మెంట్ పథకం) సంబందించిన జీవో నెం.307ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రటరీ గత నెల 28న జారీచేశారు.

Read More:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..

గుడ్ న్యూస్: ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు