తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. 

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీలలో మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. 

Updated on: Jul 17, 2020 | 4:11 PM

Mid Day Meal In Inter And Degree: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్… 2020-21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీలలో మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే ఈ పధకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వం స్కూళ్లలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలలో కూడా అమలవుతే.. డ్రాపౌట్స్ తగ్గుతాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విద్యార్ధులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతోనే మధ్యాహ్న భోజన పధకాన్ని జూనియర్, డిగ్రీ కాలేజీలలో అమలు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. కాగా, జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ రఘురామ్‌ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us