కొవిడ్‌పై తెలంగాణ గైడ్‌లైన్స్‌..డెడ్‌ బాడీస్‌ ను ఖననం చేసేటప్పుడు

|

Apr 09, 2020 | 5:23 PM

కొవిడ్‌పై గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. రోగి మృతదేహానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు నిర్దేశించింది. డెడ్‌బాడీతో పాటు అంబులెన్స్‌లో ఆరు పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. డ్రైవర్‌, హెల్పర్‌, అటిండెంట్లు నలుగురికి కిట్లు ఇస్తారు. మృతదేహం వెళ్లిన తర్వాత ఫ్లోర్‌, కిటికీలు, వెంటిలేటర్లు, రూఫ్‌ ను.. హైపోక్లోరైడ్‌ ద్రావణంతో ఆరుసార్లు స్ప్రే చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది తెలంగాణ సర్కారు. కరోనా వైరస్ అతి భయానకం. ఏ మాత్రం […]

కొవిడ్‌పై తెలంగాణ గైడ్‌లైన్స్‌..డెడ్‌ బాడీస్‌ ను ఖననం చేసేటప్పుడు
Follow us on

కొవిడ్‌పై గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. రోగి మృతదేహానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు నిర్దేశించింది. డెడ్‌బాడీతో పాటు అంబులెన్స్‌లో ఆరు పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. డ్రైవర్‌, హెల్పర్‌, అటిండెంట్లు నలుగురికి కిట్లు ఇస్తారు. మృతదేహం వెళ్లిన తర్వాత ఫ్లోర్‌, కిటికీలు, వెంటిలేటర్లు, రూఫ్‌ ను.. హైపోక్లోరైడ్‌ ద్రావణంతో ఆరుసార్లు స్ప్రే చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది తెలంగాణ సర్కారు. కరోనా వైరస్ అతి భయానకం. ఏ మాత్రం గాలి సోకినా.. మిగతా వారికి వ్యాపించే అవకాశం ఉంది. అందుకే కరోనాను పకడ్బందీగా కంట్రోల్ చేయాలని యోచిస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా డెడ్‌ బాడీస్‌ ను ఖననం చేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. అందుకే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు నిర్దేశించింది.