పీఆర్సీ నివేదిక సిద్దం… ఫిట్‌మెంట్‌ ఎంతంటే…!

| Edited By:

Nov 18, 2019 | 4:15 PM

తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో వెంటనే పీఆర్సీ నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు. దీనికి ముహూర్తం కూడా ఖరారైంది. నివేదిక అందిన రోజే ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. దీంతో పీఆర్సీ కమిటీ ఇప్పటికే తయారు చేసుకున్న నివేదిక కు తుది మెరుగులు దిద్దుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు డిసెంబర్ లేదా కొత్త ఏడాది నుంచి కొత్త వేతనాలు ఇచ్చేలా దీనికి తుది రూపం ఇస్తున్నారు. ఉద్యోగులకు 27 శాతం నుంచి 35 శాతం […]

పీఆర్సీ నివేదిక సిద్దం... ఫిట్‌మెంట్‌ ఎంతంటే...!
Follow us on

తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో వెంటనే పీఆర్సీ నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు. దీనికి ముహూర్తం కూడా ఖరారైంది. నివేదిక అందిన రోజే ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. దీంతో పీఆర్సీ కమిటీ ఇప్పటికే తయారు చేసుకున్న నివేదిక కు తుది మెరుగులు దిద్దుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు డిసెంబర్ లేదా కొత్త ఏడాది నుంచి కొత్త వేతనాలు ఇచ్చేలా దీనికి తుది రూపం ఇస్తున్నారు. ఉద్యోగులకు 27 శాతం నుంచి 35 శాతం మధ్య ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పీఆర్సీ కమీషన్ సిఫార్సు చేసిన ఫిట్ మెంట్ పైన చర్చించి… ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయనుంది.

రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2015లో అటు ఏపీ..ఇటు తెలంగాణ ప్రభుత్వాలు 43 శాతం ఫిట్ మెంట్ అమలు చేసాయి. ఇక, కొద్ది నెలల క్రితం ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్..ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏపీ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించి..అమలు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె…ఉద్యోగ సంఘాల మద్దతు నేపథ్యంలో ప్రభుత్వం పీఆర్సీ అమలు దిశగా నిర్ణయం తీసుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తరువాత నిర్ణయం ఉంటుందని గతంలోనే సీఎం స్పష్టం చేసారు. ఈ నెల 22న ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక అందనుంది.

పీఆర్సీ సిఫార్సులు.. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితిని స్వయంగా ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నేతలకు వివరించనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పీఆర్సీ తమ సిఫార్సుల్లో 24 శాతం ఫిట్‌మెంట్‌ గా పేర్కొనట్లుగా తెలుస్తోంది. ఫిట్‌మెంట్‌ను వెంటనే అమలు చేస్తారా లేక 2020 మార్చి దాకా ఐఆర్‌ ఇచ్చి, బడ్జెట్‌ అనంతరం ఫిట్‌మెంట్‌ను అమల్లోకి తెస్తారా అన్నది ఆ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపైనా విధాన నిర్ణయం తీసుకోనున్నారు. రెండేళ్ల దాకా పెంచుతామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.