ఇక మూసీ సుందరీకరణ..”టార్గెట్ 2022″

|

Sep 28, 2020 | 1:23 PM

మూసీ ప్రక్షాళనపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీవ్రంగా పరిగణించడంతో కాలుష్య నియంత్రణ మండలితో పటు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ(GHMC) శాఖలు నది ప్రక్షాళనకు కార్యచరణ చేపట్టాయి. కలుషిత జలాల శుద్ధి కోసం మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి జలమండలి రెడీ అవుతోంది. వారంలో టెండర్లు పిలవబోతోంది.

ఇక మూసీ సుందరీకరణ..టార్గెట్ 2022
Follow us on

Musi Beautification : ఏడాదిలోగా మూసీ ప్రక్షాళన చేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ సూచించింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు రిటైర్డ్‌ జడ్జి విలాస్‌ అప్జల్‌ పుర్కర్‌ నేతృత్వంలో కమిటీని నియమించింది. నెలరోజుల్లో కమిటీ మొదటి సమావేశం నిర్వహించాలని ఆదేశించిన ట్రైబ్యునల్‌…. నాలుగు నెలల్లో తొలి నివేదిక అందజేయాలని ఆదేశించింది.

మూసీ ప్రక్షాళనపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీవ్రంగా పరిగణించడంతో కాలుష్య నియంత్రణ మండలితో పటు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ(GHMC) శాఖలు నది ప్రక్షాళనకు కార్యచరణ చేపట్టాయి. కలుషిత జలాల శుద్ధి కోసం మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి జలమండలి రెడీ అవుతోంది. వారంలో టెండర్లు పిలవబోతోంది.

హైదరాబాద్‌లో 1800 MLD మురుగునీరు వస్తోంది. ఇందులో ప్రస్తుతం 700 MLDల మురుగునీటినే క్లీన్‌ చేస్తున్నారు. వచ్చే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 65 మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టాలని జలమండలి నిర్ణయించింది. నిధుల సమస్యతో ప్రస్తుతం 17 STPలు మాత్రమే నిర్మిస్తున్నారు.

శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ వంటి ప్రాంతాల్లో 17 ఎస్టీపీలతో రోజు 365 MLDల మురుగునీటిని శుద్ధి చేయాలనేది టార్గెట్‌ 1200 కోట్ల రూపాయలతో చేపట్టిబోయే మురుగునీటి శుద్ధి కేంద్రాలకు ప్రభుత్వం టెండర్లు పిలవబోతోంది. 2022 మే నాటికి వీటి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 51 కిలోమీటర్ల మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మూడు దశల్లో ప్రభుత్వం చేపట్టబోతోంది.