ఘనంగా తుంగభద్ర పుష్కరాలు.. వేదమంత్రోచ్ఛారణ నడుమ గంగా హారతి.. కనుల పండుగగా కార్తీక దీపోత్సవం..

పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాలు నాలుగోవ రోజుకు చేరుకున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లో పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ స్నానాలు..

ఘనంగా తుంగభద్ర పుష్కరాలు.. వేదమంత్రోచ్ఛారణ నడుమ గంగా హారతి.. కనుల పండుగగా కార్తీక దీపోత్సవం..
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 23, 2020 | 7:53 PM

పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాలు నాలుగోవ రోజుకు చేరుకున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లో పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. దేశంలోనే ఐదో శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడి ఘాట్‌కు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ నుంచి భక్తులు వచ్చి పుష్కర స్నానం అచరిస్తున్నారు. గత మూడు రోజులుగా భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా నాలుగోవరోజు కార్తీక సోమవారం కావడం పొటెత్తారు.

తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి కార్తీక దీపారాధనలో భక్తులు అమ్మవారిని కొలుస్తున్నారు.ఈ సాయంత్రం ఆలయ అర్చకులు తుంగభద్ర నదికి గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అబ్రహం దంపతులతోపాటు ఆలయకమిటీ చైర్మన్ రవికుమార్ గౌడ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుంగభద్ర పుష్కరాలు నవంబర్‌ 20 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు కొనసాగనున్నాయి. మరోవైపు జిల్లా పోలీసులు అధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.