AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ 2.0: హైదరాబాద్‌లో నయా రూల్స్.. ఫాలో అవ్వాల్సిందే..

తెలంగాణలో కోవిద్-19 పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో 45 శాతం కేసులు ఉండటంతో... ప్రభుత్వం... లాక్‌డౌన్‌ను మరింత బలంగా అమలు చెయ్యాలని నిర్ణయించుకుంది. అలాగే... కేసులు

లాక్‌డౌన్ 2.0: హైదరాబాద్‌లో నయా రూల్స్.. ఫాలో అవ్వాల్సిందే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 15, 2020 | 12:35 PM

Share

తెలంగాణలో కోవిద్-19 పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో 45 శాతం కేసులు ఉండటంతో… ప్రభుత్వం… లాక్‌డౌన్‌ను మరింత బలంగా అమలు చెయ్యాలని నిర్ణయించుకుంది. అలాగే… కేసులు ఎక్కువగా ఉన్న 139 ప్రాంతాల్లో కంటైన్మెంట్ క్లస్టర్లను రెడీ చేసింది. ఈ ప్రాంతాల్ని పూర్తిగా కంట్రోల్‌లో ఉంచబోతోంది. కంటైన్మెంట్ జోన్లకు సర్కిల్, జోనల్ స్థాయిలో నోడల్ బృందాలు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ GHMC సిబ్బంది ఎలాంటి రూల్స్ పాటించాలో… ఓ ప్రకటన ప్రభుత్వం రిలీజ్ చేసింది.

రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో దారుల్ని 8 అడుగుల ఎత్తుండే బారికేడ్లతో మూయాలి. ఈ జోన్లలోకి వెళ్లి, వచ్చేందుకు ఒకటే రూట్ ఉండాలి. జోన్లను 24 గంటలూ పోలీసులు పర్యవేక్షించాలి. జోన్లలో వాళ్లు బయటకు రాకూడదు. బయటి వాళ్లు లోపలికి వెళ్లకూడదు. పోలీసుల్లో ఏఎస్సై లేదా ఎస్సై లేదా సీఐ స్థాయి ఆఫీసర్ పర్యవేక్షించాలి. జోన్లలో ఉండేవారికి నిత్యవసరాలు అందించేందుకు ఓ నోడల్ ఆఫీసర్, శానిటైజేషన్ కార్యక్రమాలకు మరో ఆఫీసర్ ఉండాలి. అలాగే ఓ బిల్ కలెక్టర్ ఉంటారు. వీళ్లు ఇంటింటికీ వెళ్లి.. నిత్యవసరాలు ఇస్తారు. మాస్కులు కూడా ఇస్తారు.

కాగా.. ఈ కంటైన్మెంట్ జోన్లలో రోజూ శానిటేషన్ (శుభ్రత-పరిశుభ్రత) ఉంటుంది. రోజుకు రెండుసార్లు… సూక్ష్మక్రిములను చంపే రసాయానాల్ని పిచికారీ చేస్తారు. ఈ పని అధికారులు మాత్రమే చేస్తారు. ప్రజలు చెయ్యకూడదు.కరోనా ఉందా లేదా అన్నది తెలుసుకునేందుకు రోజూ ఫీవర్ సర్వే ఉంటుంది. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే… ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాజిటివ్ అని తేలితే… వారిని ఐసోలేషన్‌కి తరలించి… వారి కుటుంబ సభ్యుల్ని, చుట్టుపక్క వారిని క్వారంటైన్‌కి తరలిస్తారు. వారి చేతిపై క్వారంటైన్ ప్రింట్ (ముద్ర లేదా స్టాంప్) వేస్తారు.

Follow Us
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే