వేతనాల కోతపై జూన్ 1న నిరసన.. ప్రభుత్వ ఉద్యోగుల నిర్ణయం..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి.

వేతనాల కోతపై జూన్ 1న నిరసన.. ప్రభుత్వ ఉద్యోగుల నిర్ణయం..

Edited By:

Updated on: May 29, 2020 | 10:38 AM

Employees protests on the Pay cut: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. అయితే మే నెల వేతనంలోనూ కోత విధించాలన్నతెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ జూన్‌ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌, కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది.

కాగా.. టీఎన్జీవో, టీజీవో సంఘాల నాయకుల వైఫల్యమే ఇందుకు పరోక్ష కారణమని కమిటీ ఆక్షేపించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన కమిటీ సమావేశంలో 30 మంది హాజరయ్యారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ.. జూన్ 1న 10:30 నుంచి 11:30 వరకు నిరసనలో పాల్గొనాలని, కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేయాలని ఐక్యవేదిక నిర్ణయించింది. వరుసగా మూడో నెల కోతలు అమలు చేయడం వల్ల లక్షలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతాయని ఐక్యవేదిక పేర్కొంది.

Also Read: ఏపీలో ఇంటర్ ప్రైవేటు కాలేజీ అడ్మిషన్లకు.. నయా రూల్స్..