దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్లు

దంచికొడుతున్న వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. దాదాపు చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ వర్షాల ప్రభావంతో ప్రాణ నష్టం కంటే.. ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందని  అధికారలు అండగా నిలిచారు. వర్షాలు, వరదలతో విద్యార్హత,..

దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్లు
Follow us

|

Updated on: Oct 22, 2020 | 1:29 AM

దంచికొడుతున్న వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. దాదాపు చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ వర్షాల ప్రభావంతో ప్రాణ నష్టం కంటే.. ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందని  అధికారలు అండగా నిలిచారు. వర్షాలు, వరదలతో విద్యార్హత, ఇతర సర్టిఫికెట్లు కోల్పోయిన వారు, పాడైయిన వారు ఉంటే ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఉచితంగా విద్యార్థుల సర్టిఫికెట్లను జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించారు.

ఈ మేరకు పాఠశాల విద్యా, ఇంటర్మీడియట్‌ బోర్డు, కళాశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు, విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులు తాము పోగొట్టుకున్న, తడిచి పాడైపోయిన సర్టిఫికెట్లను తిరిగి పొందేందుకు తమ పేరు, పరీక్ష, హాల్‌ టికెట్‌ నెంబర్, సంవత్సరం తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.