తెలంగాణను వదలని కరోనా.. కొత్తగా 397 మందికి పాజిటివ్.. నిన్న మరో ఇద్దరు మృతి
తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. గడిచిన 24గంటల వ్వవధిలో కొత్తగా 397 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. గడిచిన 24గంటల వ్వవధిలో కొత్తగా 397 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి 8గంటల నుంచి సోమవారం రాత్రి 8గంటల వరకు 42,737 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 397 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,85,465కి చేరుకుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. సోమవారం కరోనా బారినపడి మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,535కి చేరింది. కరోనా వైరస్‌ను జయించిన మరో 627 మంది నిన్న కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,77,931కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,999 ఉండగా వీరిలో 3,838 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 67,93,691కి చేరింది. మరోవైపు కొత్త రకం స్ట్రెయిన్ కూడా రాష్ట్ర ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా యూకే నుంచి ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిలో.. కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్ ఉన్నట్లు తాజాగా సీసీఎంబీ నిర్ధారించినట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖ కూడా దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.