తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. నిన్న రాత్రి 8గంటల వరకు 42,242 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా .. కొత్తగా 761 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు వైరస్ కారణంగా ప్రాణాలు విడిచినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా వచ్చిన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,67,665 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1,448 కి చేరింది. ఇక వైరస్ బారి నుంచి తాజాగా 702 మంది కోలుకోగా, రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2,55,378 కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 10,839 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 8,651 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలో డెత్ రేటు 0.54 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 136 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
Also Read :
నేడు ఏపీ కేబినెట్ భేటీ, సభలో పెట్టే బిల్లులపై చర్చ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక నిర్ణయం
ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు
కేంద్రం కీలక నిర్ణయం, స్థానిక భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే