కరోనా అప్‌డేట్ : దేశంలో కొత్తగా 36,011 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు ఎంతంటే..?
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 36,011 మంది వైరస్ బారిన పడ్డట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 96,92,920కి చేరింది.
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 36,011 మంది వైరస్ బారిన పడ్డట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 96,92,920కి చేరింది. ఇక శనివారం వైరస్ కారణంగా 482 మంది ప్రాణాలు విడిచారు. కరోనాతో ఇప్పటి వరకు 1,40,182 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4,03,248 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. శనివారం 41,970 మంది వ్యాధి బారి నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 91,00,792 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 11,01,063 వైరస్ నిర్ధారణ టెస్టులు చేశారు. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4.18 శాతానికి తగ్గాయి. అలాగే రికవరీ రేటు 94.37 శాతానికి పెరిగింది. డెత్ 1.45శాతంగా ఉంది. గత వారం రోజులుగా కొత్త కేసులు 40 వేల కంటే దిగువన నమోదు అవుతుండడం ఊరటనిచ్చే అంశం.
Also Read :
ఏటా 10 రోజులు ‘నో స్కూల్ బ్యాగ్ డే’ అమలు చెయ్యండి, రాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులకు కేంద్రం లేఖ
కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 622 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు ఎంతంటే..?