యావత్ దేశాన్నే షేక్ చేసిన.. పోలీసులపై పూల వర్షం కురిపించిన.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు నేటితో ఏడాది..

యావత్ దేశాన్ని షేక్ చేసింది ఆ ఘటన.. తప్పు చేయాలనుకునే మృగాళ్లలో వణుకు పుట్టించింది ఆ ఘటన.. తెలంగాణ పోలీస్‌ శభాష్ అంటూ సలాం కొట్టించింది..

యావత్ దేశాన్నే షేక్ చేసిన.. పోలీసులపై పూల వర్షం కురిపించిన.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు నేటితో ఏడాది..
Follow us

|

Updated on: Dec 06, 2020 | 11:21 AM

యావత్ దేశాన్ని షేక్ చేసింది ఆ ఘటన.. తప్పు చేయాలనుకునే మృగాళ్లలో వణుకు పుట్టించింది ఆ ఘటన.. తెలంగాణ పోలీస్‌ శభాష్ అంటూ సలాం కొట్టించింది ఆ ఘటన.. అదే దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున ఉదయం తెల్లవారుజామున నలుగురు మానవ మృగాలను.. తెలంగాణ పోలీసులు మట్టుబెట్టారు. ఆడవారిపై చేయి వేసే ఎంతటివారికైనా ఇదే గతి పట్టిద్దంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఈ ఘటనకు నేటితో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో నాడు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం.

తొండూపల్లి టోల్ గేట్ వద్ద వెటర్నరీ డాక్టర్ అయిన దిశపై నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై అపస్మార స్థితిలో ఉన్న యువతిని తీసుకెళ్లి షాద్‌నగర్ చటాన్ పల్లి అండర్ బ్రిడ్జ్ కింద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటన తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేసింది. రాష్ట్రంలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుకాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సైబరాబాద్ పోలీసులు.. స్వల్ప కాల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు విచారణలో భాగంగా సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను డిసెంబర్ 6వ తేదీన ఉదయం 5 గంటలకు దిశను సజీవ దహనం చేసిన చోటు అయిన చటాన్ పల్లిలో గల అండర్ బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో నలుగురు నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా నలుగురు నిందితులనూ ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేయగా, ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పోలీసులపై మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టులోనూ ఈ ఎన్‌కౌంటర్‌పై కేసు నడుస్తోంది.

శంషాబాద్ శివారులోని తొండుపల్లి టోల్‌గేట్ సమీపంలో 2019 నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్‌ దిశ బైక్‌‌కు పంచర్ చేసి.. ఆపై సాయం చేస్తామంటూ డ్రామా ఆడి.. నలుగురు దుర్మార్గులు యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద గల అండర్ బ్రిడ్జ్ కింద యువతిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటనపై యావత్ దేశం భగ్గుమంది. నిందితులను కఠినంగా శిక్షించాలని సమాజం అంతా ఒక్కటై నినదించింది. చివరికి నిందితులంతా ఎన్‌కౌంటర్‌లో హతమవడంతో పోలీసులపై ప్రజలు పూల వర్షం కురిపించారు.