గ్రేటర్ ఎన్నికల్లో గెలిచినవారిలో 25 మందికి నేర చరిత్ర..వివరాలు విడుదల చేసిన ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లలో 25 మంది నేరచరిత్ర కలిగిన వారున్నారు. బీజేపీ నుంచి 10 మంది, టీఆర్‌ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం పార్టీ తరుఫున...

గ్రేటర్ ఎన్నికల్లో గెలిచినవారిలో 25 మందికి నేర చరిత్ర..వివరాలు విడుదల చేసిన ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌
Follow us

|

Updated on: Dec 06, 2020 | 9:27 AM

గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లలో 25 మంది నేరచరిత్ర కలిగిన వారున్నారు. బీజేపీ నుంచి 10 మంది, టీఆర్‌ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం పార్టీ తరుఫున గెలిచినవారిలో ఏడుగురు కార్పొరేటర్లు ఆ లిస్ట్‌లో ఉన్నారు. పోయినసారి 30 మంది నేరచరితులు ఉన్నారని, ఈ సారి ఆ సంఖ్య తగ్గిందని ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి శనివారం పేర్కొన్నారు.

ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌  రిలీజ్ చేసిన లిస్ట్ 
  1. బీజేపీ: టి.శ్రీనివాస్‌రెడ్డి(మైలార్‌దేవ్‌పల్లి), డి.కరుణాకర్‌(గుడిమల్కాపూర్‌), కె.నర్సింహారెడ్డి(మన్సూరాబాద్‌), వి.మధుసూదన్‌రెడ్డి(చంపాపేట్‌), వి.రాధ(ఆర్‌కేపురం), వి.పవన్‌కుమార్‌(కొత్తపేట), లాల్‌సింగ్‌(గోషామహల్‌), కె.రవికుమార్‌(రాంనగర్‌), వి.శ్రవణ్‌(మల్కాజిగిరి) జి.శంకర్‌యాదవ్‌(బేగంబజార్‌)
  2. టీఆర్ఎస్:  ఆర్‌.నాగేందర్‌ యాదవ్‌(శేరిలింగంపల్లి), ఎం.కుమార్‌యాదవ్‌(పటాన్‌చెరు), బాబా ఫసియుద్దీన్‌(బోరబండ), ఎన్‌.శ్రీనివాస్‌రావు(హైదర్‌నగర్‌),  ఆర్‌.జితేంద్రనాథ్‌(మచ్చబొల్లారం), విజయశేఖర్‌(రంగారెడ్డినగర్‌), వై.ప్రేమ్‌కుమార్‌(ఈస్ట్‌ ఆనంద్‌భాగ్‌), సునీతరెడ్డి(మెట్టుగూడ)
  3. ఎంఐఎం: ఎండీ అలీషరీఫ్‌(లలితాభాగ్‌), అబ్దుల్‌వాహబ్‌(చాంద్రాయణగుట్ట), ఎస్‌.మిన్హాజుద్దీన్‌(అక్బర్‌భాగ్‌),  ఎండీ ముస్తఫాఅలీ(శాలిబండ), కె.ముబాషిరుద్దీన్‌(కిషన్‌భాగ్‌), ఎం.స్వామి(కార్వాన్‌), ఎండీ జాకీర్‌బాకర్‌(దత్తాత్రేయనగర్‌)

Also Read : ఏటా 10 రోజులు ‘నో స్కూల్‌ బ్యాగ్ డే’ అమలు చెయ్యండి, రాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులకు కేంద్రం లేఖ

Latest Articles