
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో 2,574 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,969కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్ రిలీజ్ చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 886కి చేరింది.
తెలంగాణలో శనివారం చేసిన టెస్టుల సంఖ్య 62,736
తెలంగాణలో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య : 17,30,389
రాష్ట్రంలో నిన్న(శనివారం) పాజిటివ్ కేసులు : 2,574
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు : 1,40,969
జీహెచ్ఎంసీలో నిన్న (శనివారం) కేసుల సంఖ్య : 325
కరోనాతో నిన్న (శనివారం) మరణాలు : 9
ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య : 886
రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసులు : 32,553
నిన్న (శనివారం) ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయిన వారు: 2,927
ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య: 1,07,530