Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 238 వైరస్ పాజిటివ్ కేసులు..మరణాలు, యాక్టీవ్ కేసుల వివరాల ఇలా ఉన్నాయి

|

Jan 04, 2021 | 10:18 AM

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా  27,077 పరీక్షలు నిర్వహించగా.. 238 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 2,87,740కి చేరింది.

Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 238 వైరస్ పాజిటివ్ కేసులు..మరణాలు, యాక్టీవ్ కేసుల వివరాల ఇలా ఉన్నాయి
Follow us on

Telangana Corona Cases :  తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా  27,077 పరీక్షలు నిర్వహించగా.. 238 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 2,87,740కి చేరింది. మరోవైపు వైరస్ కారణంగా కొత్తగా ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 1551కి చేరింది. మరోవైపు తాజాగా 518 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 2,81,083కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,106 యాక్టీవ్ కేసులున్నాయి.  వీరిలో 2,942 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా వెలుగు చూసిన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 60 కేసులు ఉన్నాయి.

పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.

Also Read :

Hyderabad To Vishakapatnam Train: పండుగ వేళ రైల్వే శాఖ గుడ్ న్యూస్.. కాచిగూడ-విశాఖపట్నం సర్వీసు పున:ప్రారంభం

Bird Flu Alert: రాష్ట్రాలకు కేంద్రం హై అలర్ట్.. బ‌ర్డ్ ఫ్లూ మనుషులకూ వ్యాప్తి చెందే అవకాశం..పలు ఆదేశాలు జారీ