తెలంగాణ క‌రోనా నేటి బులిటెన్ : జిల్లాల వారీగా కేసులు

|

Aug 17, 2020 | 9:56 AM

తెలంగాణ‌లో కరోనా తీవ్ర‌త‌ కొనసాగుతూనే ఉంది. ఆదివారం (16వ తేదీన) కొత్తగా 894 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ క‌రోనా నేటి బులిటెన్ : జిల్లాల వారీగా కేసులు
Follow us on

Telangana Corona Cases : తెలంగాణ‌లో కరోనా తీవ్ర‌త‌ కొనసాగుతూనే ఉంది. ఆదివారం (16వ తేదీన) కొత్తగా 894 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం క‌రోనా బారినప‌డ్డ‌వారి సంఖ్య‌ 92,255కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్ రిలీజ్ చేసింది. ఆదివారం ఒక్కరోజే కోవిడ్ కార‌ణంగా మరో 10 మంది మృతి చెందగా.. మొత్తం చ‌నిపోయిన‌వారి సంఖ్య‌ 703కి చేరింది. తాజాగా 2,006 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 70,132కి చేరింది. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రస్తుతం 21,420 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆదివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 147 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 85, కరీంనగర్‌ జిల్లాలో 69, పెద్దపల్లి జిల్లాలో 62, సిద్దిపేట జిల్లాలో 58, మేడ్చల్‌ జిల్లాలో 51 కేసులు నమోదయ్యాయి.

Also Read :

పబ్​జీ ఆడేందుకు ఫోన్​ ఇవ్వలేదని బ్లేడ్​తో గొంతు కోసుకున్నాడు

పెరిగిన‌ వరద ఉదృతి : క‌డెం ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత‌