Congress Party 2nd List : జీహెచ్ఎంసీ ఎన్నికల సమరం క్రమంగా హీటెక్కుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ 105 మందితో తొలిజాబితా ప్రకటించగా.. కాంగ్రెస్ 29 మందితో తొలి జాబితా, 16 మందితో రెండో జాబితా విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ 45 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన డివిజన్లలో అభ్యర్థులను ప్రకటించారు. స్థానికంగా ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగతా జాబితాను గురువారం విడుదల చేసే అవకాశముంది.