ఇవాళ ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం.. పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఇవాళ సమావేశమవుతారు

ఇవాళ ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం.. పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ

Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 31, 2020 | 7:13 AM

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఇవాళ సమావేశమవుతారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్‌కు రావాలని టీఎన్జీవో, టీజీవో నేతలను పిలిచారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌తో దాదాపు 200 మంది ఉద్యోగులు, అధికారులు భేటీ కానున్నారు. పీఆర్సీ, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, ఇతర సమస్యలపై ముఖ్యమంత్రి ఉద్యోగులతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలన్నీ ఫిబ్రవరి చివరి కల్లా పరిష్కారమవ్వాలని ఇప్పటికే అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఉద్యోగసంఘాల భేటీని ఆత్మీయ సమావేశంగా ఏర్పాటు చేస్తున్నారు. భేటీకి హాజరయ్యే ఉద్యోగులందరికీ ప్రగతిభవన్‌లోనే మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.