ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. ఇవే కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. సుమారు రెండు గంటలపైగా జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ పలు నిర్ణయాలకు ఓకే చెప్పింది...

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. ఇవే కీలక నిర్ణయాలు

Updated on: Sep 07, 2020 | 10:23 PM

Telangana cabinet meeting  : తెలంగాణ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. సుమారు రెండు గంటలపైగా జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ పలు నిర్ణయాలకు ఓకే చెప్పింది. ఇందులో కొత్త రెవెన్యూ చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎల్లుండి అసెంబ్లీ రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులకు ఆమోదం తెలిపింది. సచివాలయ నిర్మాణం, పాత సచివాలయం కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించి పరిపాలనా అనుమతులను  కేబినెట్ ఆమోదించింది.

 

కేబినెట్ కీలక నిర్ణయాలివీ..

– కొత్త రెవెన్యూ చట్టానికి కేబినెట్ ఆమోదం

– ఎల్లుండి అసెంబ్లీలో రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

– మున్సిపల్ యాక్ట్-2019 సవరణ బిల్లకు కేబినెట్ ఆమోదం

– తెలంగాణ జీఎస్టీ యాక్ట్‌-2017లో సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

– తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్‌ అమెండ్మెంట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం

– డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం

– టీఎస్ బిపాస్ బిల్లును ఆమోదించిన మంత్రవర్గం

– ఆయుష్ కాలేజీ అధ్యాపకుల పదవీవిరమణ వయోపరిమితి పెంపు ఆర్డినెన్స్‌కు ఆమోదం

– 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులకు ఆమోదం

– సచివాలయ నిర్మాణం, పాత సచివాలయం కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించి పరిపాలనా అనుమతులను ఆమోదించిన కేబినెట్

– కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది.