అయోధ్య రామాలయంపై కేసీఆర్‌కు రాములమ్మ ప్రశ్నలు, ఎంఐఎంకు అసలైన బంధువునని చెబుతారా అంటూ వ్యాఖ్యలు

|

Feb 01, 2021 | 3:18 AM

అయోధ్య రామాలయం నిర్మాణం విషయంలో మీ వైఖరేంటని సీఎం కేసీఆర్‌ని రాములమ్మ ప్రశ్నించారు. వరుస ట్వీట్లలో దీనికి సంబంధించి పలు అంశాలు ప్రస్తావించారు బీజేపీనేత విజయశాంతి...

అయోధ్య రామాలయంపై కేసీఆర్‌కు రాములమ్మ ప్రశ్నలు, ఎంఐఎంకు అసలైన బంధువునని చెబుతారా అంటూ వ్యాఖ్యలు
Follow us on

అయోధ్య రామాలయం నిర్మాణం విషయంలో మీ వైఖరేంటని సీఎం కేసీఆర్‌ని రాములమ్మ ప్రశ్నించారు. వరుస ట్వీట్లలో దీనికి సంబంధించి పలు అంశాలు ప్రస్తావించారు బీజేపీనేత విజయశాంతి. “టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయోధ్య రామాలయం అంశంలో తరచుగా భద్రాద్రి ఆలయం గురించి ప్రస్తావిస్తున్నారు. అయోధ్య రామాలయాన్ని దేశ ప్రజలందరూ భక్తిభావంతో రామయ్య జన్మభూమిలో స్వచ్ఛందంగా నిర్మించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి లాగే భద్రాద్రిలో కూడా ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దితే ప్రజలందరూ అందుకు హర్షిస్తారు. భక్తితో ఆ కార్యక్రమంలో కూడా పాలుపంచుకుంటారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అది సహించకో.. భద్రాద్రిలో బ్రహ్మాండంగా నిర్మాణాల అభివృద్ధి చేపడతామని మంత్రులతో మెలికలు పెట్టిస్తున్నారు. ఇందరు టీఆరెస్ ఎమ్మెల్యేలు అయోధ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఖండించలేని ముఖ్యమంత్రిగారు రామాలయానికి అనుకూలమా? కాదా? స్పష్టంగా ప్రకటన చెయ్యాలి. లేదా నేను మాటల్లోనే హిందువునని… అయోధ్య విషయంలో ఎంఐఎంకు అసలైన బంధువునని చెబుతారో… కేసీఆర్ తేల్చుకోవాలి.” అని విజయశాంతి అన్నారు.