AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రోజు సద్దుల బతుకమ్మ…

మహాలయ అమవాస్యతో ప్రారంభమై 9 రోజుల పాటు వైభవంగా సాగిన తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ ఉత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. తొమ్మిది రోజులు వివిధ పేర్లతో పూజలందుకునే బతుకమ్మ..

ఈ రోజు సద్దుల బతుకమ్మ...
Sanjay Kasula
| Edited By: |

Updated on: Oct 24, 2020 | 9:20 AM

Share

తెలంగాణలోని ప్రతీ ఆడపడుచు సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటుతుంటాయి. తొమ్మిది రోజులు వివిధ పేర్లతో గౌరమ్మ పూజించిన మహిళలు చివరి రోజు సద్దుల బతుకమ్మగా పూజిస్తారు.

మహాలయ అమవాస్యతో ప్రారంభమై 9 రోజుల పాటు వైభవంగా సాగిన తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ ఉత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. తొమ్మిది రోజులు వివిధ పేర్లతో పూజలందుకునే బతుకమ్మ.. చివరి రజు సద్దుల బతుకమ్మ. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. శనివారం సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లాలు సిద్ధమయ్యాయి. ఆడబిడ్డలు పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చడానికి సిద్ధమవుతున్నారు. అడవికి వెళ్లిన అన్నా..తమ్ముళ్లు తంగెడు పూలతోపాటు రకరకాల పూలు తెచ్చిన పెద్ద బతుకమ్మను పేర్చుతారు. రాష్ట్రంలోని ముఖ్యపట్టణాలు ఇప్పటికే పండుగ కళను సంతరించుకోనున్నాయి.

బతుకమ్మ పండుగలో ఆఖరి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విజయదశమి కంటే సద్దుల బతుకమ్మకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నిండు మనసారా గౌరమ్మను ఆరాధిస్తారు. మన సంస్కృతి ఉట్టిపడేలా పాటలు పాడుతూ సందడిగా మారనున్నాయి. ఈ బతుకమ్మ వేడుకలు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. తర్వాత ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మతో ఈ ఎనిమిది రోజులు వేడుకలు జరుగుతాయి.

సాయంత్రం ఆడబిడ్డలు చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కన మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ సందడిగా సాగనంపుతారు. ఇక తెలంగాణలోని ఊరు..వాడ  తెలంగాణ పాటలతో మార్మోగుతుంది. చీకటి పడుతుందనగా బతుకమ్మలు తలపై పెట్టుకొని ఊరి చెరువుకు ఊరేగింపుగా బయల్దేరుతారు. అక్కడ కూడా మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత మలీద అనే పిండి వంటకాన్ని కొంత చెరువులో గంగమ్మ తల్లి పేరున వేస్తారు. గంగమ్మకు నమస్కరింస్తారు. తర్వాత పలారాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు.