ఆస్ట్రేలియా టూర్‌కు డేట్ ఫిక్స్..

సిడ్నీలోనే వాళ్లంతా క్వారెంటైన్ పూర్తి చేసుకుంటారు. ఈ ప‌ర్య‌ట‌నలో టీమిండియా నాలుగు టెస్టులు, మూడు వ‌న్డేలు, మూడు టీ20 ఆడ‌నున్న‌ది. న‌వంబ‌ర్ 27 నుంచి తొలి వ‌న్డే సిరీస్ ప్రారంభంకానున్న‌ది...

ఆస్ట్రేలియా టూర్‌కు డేట్ ఫిక్స్..
Follow us

|

Updated on: Oct 22, 2020 | 9:17 PM

Team India Tour Of Australia : టీమిండియా పర్యటనకు ఆస్ట్రేలియా సర్కార్ పచ్చ జెండా ఊపింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న టీమిండియా పర్యటన వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌టించ‌నున్న‌ది. ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఐపీఎల్‌లో ఆడుతున్న భార‌తీయ క్రికెట‌ర్లు అక్క‌డ నుంచే నేరుగా సిడ్నీకి చేరుకుంటారు.

సిడ్నీలోనే వాళ్లంతా క్వారెంటైన్ పూర్తి చేసుకుంటారు. ఈ ప‌ర్య‌ట‌నలో టీమిండియా నాలుగు టెస్టులు, మూడు వ‌న్డేలు, మూడు టీ20 ఆడ‌నున్న‌ది. న‌వంబ‌ర్ 27 నుంచి తొలి వ‌న్డే సిరీస్ ప్రారంభంకానున్న‌ది.

అన్ని వ‌న్డే మ్యాచ్‌ల‌ను సిడ్నీలోనే ఆడ‌నున్నారు. ఆ త‌ర్వాత మూడు టీ20 మ్యాచ్‌ల కోసం క్యాన‌బెరా ప్ర‌యాణిస్తారు. డిసెంబ‌ర్ 17 నుంచి ఆస్ట్రేలియా, ఇండియా మ‌ధ్య తొలి టెస్టు మొదలవుతుంది. అడిలైడ్‌లో ఈ టెస్టు డే అండ్ నైట్ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గ‌నున్న‌ది.

మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టును నిర్వ‌హించ‌నున్నారు. సిడ్నీ, బ్రిస్బేన్‌లో మిగితా రెండు టెస్టులు జ‌రుగుతాయి. ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించే భార‌త జ‌ట్టుకు క్వారెంటైన్ ప్రోటోకాల్‌ను న్యూసౌత్ వేల్స్ ప్ర‌భుత్వం ఆమోదించింది. న‌వంబ‌ర్ 10న ఐపీఎల్ ఫైన‌ల్ ముగిసిన త‌ర్వాత‌.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన కోహ్లీ సేన నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..