Shikhar Dhawan: తగ్గదేలే అంటున్న ధావన్‌.. పుష్పరాజ్‌గా మారిన గబ్బర్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రేజీ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. రష్మిక మందాన హీరోయిన్‌గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌లో అదరగొట్టింది.

Shikhar Dhawan: తగ్గదేలే అంటున్న ధావన్‌.. పుష్పరాజ్‌గా మారిన గబ్బర్‌

Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 12, 2022 | 6:58 AM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రేజీ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. రష్మిక మందాన హీరోయిన్‌గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌లో అదరగొట్టింది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలీవుడ్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఓటీటీలోనూ అదరగొడుతోంది. కాక ‘పుష్ప’లో బన్నీ చెప్పిన ట్రేడ్‌ మార్క్‌ డైలాగులు సూపర్‌గా పేలాయి. ఇవి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులను ఆకట్టుకున్నాయి. ఇక నెటిజన్లు కూడా ‘పుష్ప’ డైలాగులను తమదైన స్టైల్లో అనుకరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా, ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ బన్నీ డైలాగులను తమదైన స్టైల్లో చెప్పి అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ ఈ జాబితాలో చేరాడు.

‘పుష్ప… పుష్పరాజ్‌… మై ఝుకేగా నై(తగ్గేదేలే)’ అంటూ పుష్ప డైలాగ్‌ను చెప్పిఆకట్టుకున్నాడు. . కాగా తమ అభిమాన హీరో పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని గబ్బర్‌ అదిపోయే రేంజ్‌లో చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. గబ్బర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడే కాదు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే గబ్బర్‌ పలు సినిమా పాటలు, డైలాగులను అనుకరించి ఆకట్టుకున్నాడు. కాగా గత కొంతకాలంగా బెంచ్‌కే పరిమితమవుతోన్న ధావన్ జనవరి 19 నుంచి ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ధావన్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు ప్రాక్టీస్‌ కూడా ప్రారంభించాడు.

Also Read:

Saina Nehwal: హీరో సిద్ధార్థ కాక్‌ ట్వీట్‌పై స్పందించిన సైనా భర్త.. ఏమన్నాడంటే..

IPL 2022 Mega auction: ఐపీఎల్‌ మెగా వేలానికి ముహూర్తం ఖరారు.. తేదీలు, వేదిక వివరాలివే..

Viral video: కరోనా కోరలు చాస్తోన్న వేళ.. వానరం అంత్యక్రియలకు 1500 మంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..