YCP VS TDP: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరి ప్రేమ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. టీడీపీ వర్గానికి చెందిన అమ్మాయి కుటుంబసభ్యులపై వైసీపీ వర్గానికి చెందిన అబ్బాయి బంధువులు కర్రలతో దాడికి దిగడం తీవ్ర ఉదృక్తలకు దారి తీసింది.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పుర్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత అమ్మాయి పద్మ, వైసీపీ నేత అబ్బాయి మహేష్ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు ఎంతకీ ఒప్పుకోకపోవడంతో రెండు రోజుల క్రితం ఈ జంట ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అబ్బాయి తరఫు బంధువులు అమ్మాయి తండ్రి ఇంటిపై దాడికి దిగారు. మంగళవారం రాత్రి ఈ దాడులు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తలకు దారి తీశాయి. అబ్బాయి తరఫు బంధువులు ఏకంగా అమ్మాయి తల్లిదండ్రి ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడుల్లో నలుగురు గాయాలపాలయ్యారు. స్థానిక వైసీపీ నేతల అండదండలతోనే తమపై దాడి చేశారని అమ్మాయి బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Also Read: Santhabommali Nandi Idol : సంతబొమ్మాళిలో సీసీ.. బొమ్మాళీ! ఆలయంలోని విగ్రహ తరలింపులో కీలక పురోగతి.