జయరాం పై చర్యలు తీసుకోండి.. జగన్‌ను కోరిన బుద్దా

ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం పై మరోసారి ఆరోపణలు గుప్పించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. భూకబ్జాకి పాల్పడి జయరాం అడ్డంగా దొరికిపోయారన్నారు. మంత్రి ల్యాండ్ స్కాంపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో బెంజ్ కారు కొట్టేసిన గుమ్మనూరు జయరాం కన్ను.. ఆలూరులోని 450 ఎకరాల భూమిపై పడిందని, ఇట్టినా కంపెనీకి చెందిన ఈ భూమిని మంత్రి గ్యాంగ్ తప్పుడు పత్రాలు సృష్టించి కొట్టేసిందని బుద్ధా ఆరోపించారు. ఈ […]

జయరాం పై చర్యలు తీసుకోండి.. జగన్‌ను కోరిన బుద్దా

Updated on: Oct 06, 2020 | 6:44 PM

ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం పై మరోసారి ఆరోపణలు గుప్పించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. భూకబ్జాకి పాల్పడి జయరాం అడ్డంగా దొరికిపోయారన్నారు. మంత్రి ల్యాండ్ స్కాంపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో బెంజ్ కారు కొట్టేసిన గుమ్మనూరు జయరాం కన్ను.. ఆలూరులోని 450 ఎకరాల భూమిపై పడిందని, ఇట్టినా కంపెనీకి చెందిన ఈ భూమిని మంత్రి గ్యాంగ్ తప్పుడు పత్రాలు సృష్టించి కొట్టేసిందని బుద్ధా ఆరోపించారు. ఈ భూ కుంభకోణంపై ఇతర రాష్ట్రాల్లో కేసులున్నా, ఏపీలో మాత్రం ప్రభుత్వం ఈ భూకబ్జాకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. జగన్ గారూ.. ఈ భూస్కాంలో అడ్డంగా దొరికిపోయిన భూబకాసురుడు మంత్రి గుమ్మనూరు జయరాంపై చర్యలు తీసుకోండి అంటూ బుద్దా ట్విట్టర్లో కోరారు.