పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ మధ్యకాలంలో బాగా హైలెట్ అవుతున్నారు. టీడీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. అందులో కూడా కాస్త గట్టిగా మాట్లాగల్గినవారు, పార్టీ వాయిస్‌ను జనాల్లోకి తీసుకువెళ్లేవారు చాలా తక్కువమంది ఉన్నారు. కాస్త సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి కావడంతో నిమ్మల రామానాయుడు ఆ 21 మందిలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ఆయన పెన్షన్లు, రేషన్ కార్డులో మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వారి పక్షాన వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నేడు (ఫిబ్రవరి 10) యలమంచిలి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన రామానాయుడు అర్హులైన వారందరికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని తహసీల్దార్ సూర్యనారాయణ కాళ్లపై పడి అభ్యర్థించారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు, ప్రజలు, ఆఫీసర్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే తేరుకున్న తహసీల్దార్ పత్రాలను పరిశీలించి..సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.
ఇప్పడే కాదు గతంలో కూడా పలుసార్లు ఎమ్మెల్యే రామానాయుడు వినూత్న రీతిలో నిరసనను తెలిపారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని నిరసన ప్రదర్శన చేసిన ఆయన..రక్తంతో ప్లకార్డులపై వేలి ముద్రలు వేశారు. రక్తం చిందించి అయినా అమరావతి కాపుడుకుంటామని నినాదాలు ఇచ్చారు. కాగా పాలకొల్లు నుంచి రెండోసారి ఎమ్మల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు రామానాయుడు.