ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రైవేటు బాటే: దేశం నేతల కొత్త రూటు

|

Feb 12, 2020 | 4:47 PM

ఏపీలో వరుసగా తెలుగుదేశం నేతలకు షాకులు తగులుతున్నాయి. దాంతో టీడీపీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలపై కన్నేశారు. ఎవరికి వారు ప్రభుత్వం కల్పించకపోతే.. ప్రైవేటు సేవలను వినియోగించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ విషయంలో అనుకుంటున్నారా? ఏపీలో ఇటీవల మాజీలైన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం భద్రత తగ్గించడమో.. లేక పూర్తిగా ఉపసంహరించడమో చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలకు దిగుతున్న టీడీపీ నేతలు ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రావడం లేదని భావిస్తున్నారు. పైగా వైసీపీ […]

ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రైవేటు బాటే: దేశం నేతల కొత్త రూటు
Follow us on

ఏపీలో వరుసగా తెలుగుదేశం నేతలకు షాకులు తగులుతున్నాయి. దాంతో టీడీపీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలపై కన్నేశారు. ఎవరికి వారు ప్రభుత్వం కల్పించకపోతే.. ప్రైవేటు సేవలను వినియోగించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ విషయంలో అనుకుంటున్నారా?

ఏపీలో ఇటీవల మాజీలైన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం భద్రత తగ్గించడమో.. లేక పూర్తిగా ఉపసంహరించడమో చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలకు దిగుతున్న టీడీపీ నేతలు ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రావడం లేదని భావిస్తున్నారు. పైగా వైసీపీ నుంచి ఎదురు దాడి కూడా జరుగుతుండడంతో చేసేదేమీ లేక తమ రక్షణ కోసం తామే ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, పల్లెరఘునాథరెడ్డి, నారా లోకేశ్, చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్, కాల్వ శ్రీనివాసులు తదితరులకు ఏపీ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది. వీరిలో కొందరు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో వుంటూ ప్రభుత్వ సెక్యూరిటీని పొందుతున్నారు. తాజాగా వీరికి పెద్దగా థ్రెట్ లేదన్న ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది.

దాంతో వీరికి ప్రజల మధ్యకు వెళ్ళేందుకు భయం మొదలైంది. సాదాసీదాగా వుండే పోలీసు భద్రత నడుమ తిరగలేమని భావిస్తున్న ఈ నేతలు ఇప్పుడు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అందుకు హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని సెక్యూరిటీ సంస్థలను ఈ నేతలు ఆల్‌రెడీ సంప్రదించినట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన నేతలు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడంతోపాటు తమ అనుచరులకు కీలకమైన సూచనలు కూడా చేసినట్లు తెలుస్తోంది.