కర్నూలు టీడీపీ నేత దారుణ హత్య..రీజన్ అదేనా..?
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొలిమిగుండ్ల మండలానికి చెందిన టిడిపి నాయకుడు మంజుల సుబ్బారావును ప్రత్యర్థులు అతి కిరాతకంగా అంతమొందించారు. రాళ్లతో కొట్టి, వేటకొడవళ్లతో తల నరికి హతమార్చారు. పక్కా ప్లాన్‌తో రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు.. సుబ్బారావు ఓ షాపు వద్ద టీ తాగుతూ ఉండగా.. విచక్షణారహితంగా దాడి చేసి పొడిచి చంపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన బెలుంగుహాల సమీపంలో జరిగింది. సుబ్బారావు కొలిమిగుండ్ల మండలంలోని చింతలాయపల్లె గ్రామానికి […]
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొలిమిగుండ్ల మండలానికి చెందిన టిడిపి నాయకుడు మంజుల సుబ్బారావును ప్రత్యర్థులు అతి కిరాతకంగా అంతమొందించారు. రాళ్లతో కొట్టి, వేటకొడవళ్లతో తల నరికి హతమార్చారు. పక్కా ప్లాన్‌తో రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు.. సుబ్బారావు ఓ షాపు వద్ద టీ తాగుతూ ఉండగా.. విచక్షణారహితంగా దాడి చేసి పొడిచి చంపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన బెలుంగుహాల సమీపంలో జరిగింది.
సుబ్బారావు కొలిమిగుండ్ల మండలంలోని చింతలాయపల్లె గ్రామానికి చెందినవాడు. కొన్నేళ్లుగా జిల్లాలో గ్రానైట్ వ్యాపారం చేస్తున్న సుబ్బారావుకు మరో వర్గంతో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారే అతడిని చంపారని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా మృతుడు బనగానిపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని సమాచారం.