అనంతపురంజిల్లాలో సంచలనం రేపిన తాడిపత్రి ఘటనలపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. తన సోదరుడి ఇంటిపై ఎమ్మెల్యే దాడి ఘటనపై రియాక్ట్ అయిన జేసీ.. తమ ఇంటిపై దాడిచేస్తే తిరిగి తమ వాళ్లపైనే పోలీసులు కేసులు పెట్టారన్నారు. సోదరుడు ప్రభాకర్‌రెడ్డితో పాటు ఈనెల 4న తాను కూడా తాడిపత్రిలో ఆమరణదీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. పుట్టిన ప్రతిమనిషీ చావాల్సిందేనన్నారు జేసీ దివాకర్‌రెడ్డి. ఎవరూ చావుకు భయపడాల్సిన అవసరం లేదని.. తన అనుచరులు, మద్దతుదారులకు జేసీ పిలుపు ఇచ్చారు. దీక్షలకు అంతా సిద్ధంకావాలన్నారు. అమరావతి ప్రజల ఆకాంక్ష బలమైనదైనా, కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడిపెంచేలా ఉద్యమం సాగడం లేదని చెప్పుకొచ్చారు. అమరావతి విషయంలో సీఎంకి, పీఎంకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కాగా, తాడిపత్రిలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. రెండువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 4న తాడిపత్రిలో ఆమరణదీక్షకు సిద్ధమయ్యారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.