
నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే నోముల నర్సిహ్మయ్య ఆకస్మిక మరణంతో ఆ సీటు ఖాళీ అయింది. నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటులో పాగా వేసేందుకు విపక్ష పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా అక్కడి నుంచి పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తుంది.
నల్లగొండ జిల్లా అనుముల మండలం హాలియాలో తెలంగాణ టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీజీ నాయుడు, నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇంచార్జి మువ్వ అరుణ్ కుమార్, ఇతర ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని తెలిపారు. నాగార్జున సాగర్‌లో ఉన్న ముఖ్య నాయకులంతా టీడీపీ నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. నాగార్జున సాగర్‌లో ఓట్లు అడిగే హక్కు కేవలం టీడీపీకే ఉందన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి తప్పా ఇక్కడ ఏ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. క
Also Read :
Tadipatri fight : తాడిపత్రిలో హై అలర్ట్..అన్ని సెంటర్లలోనూ పికెటింగ్..నేడు కేసులు నమోదు చేసే ఛాన్స్
Variety marriage : వధువు పెళ్లి వద్దని వెళ్లిపోయింది…అతిథిలా వచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది
Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ